పంజాగుట్ట: హైదరాబాద్‌లోని అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్ సృష్టించాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయికుమార్ అనే యువకుడు గన్ చూపిస్తూ రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులను బెదరగొట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని స్టేషన్‌కు తరలించారు. అతడి నుంచి ఆరు బులెట్లు స్వాధీనం చేసుకున్నామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ హరిశ్చాంద్రారెడ్డి తెలిపారు.