హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదే సమయంలో, రానున్న మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.