హైదరాబాద్ /చందానగర్: పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల దాడి చేశారు. స్పా ముసుగులో నిర్వాహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుండి నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీసులకు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు కేసును అప్పగించారు. కేసు నమోదు చేసుకొని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ స్పా సెంటర్ చరిత్రను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈజీ మనీతో పాటు, కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా స్పా సెంటర్‌ను నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి స్పా సెంటర్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మహిళల అక్రమ రవాణాతో పాటు వ్యభిచార గృహాన్ని కూడా ఈ స్పా సెంటర్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి వారిని రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.