- లంచం తీసుకుంటూ ఏసీబీకి వలకు చిక్కి ఏడ్చేసిన మహిళ అధికారి
హైదరాబాద్ : మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కే జగ జ్యోతి ఏసీబీ ధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. జగ జ్యోతిని కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు పేర్కొన్నారు.