సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. లుంబిని పార్క్, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అలాగే, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఈ సమయంలో ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి ఉండదు. ఇక, ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్-ఉపకార్ వద్ద డైవర్ట్ చేస్తారు. బతుకమ్మ సంబురాలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
- నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు డైవర్ట్ చేస్తారు. - ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఐమాక్స్ రూట్లోకి మళ్లిస్తారు.
- నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు డైవర్ట్ చేస్తారు.
- హిమయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
- ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద డైవర్ట్ చేస్తారు.