- ఎక్స్‌లో షేర్ చేసిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్
- ఎంటీవీ హస్టిల్ సీజన్-3లో కేదెన్ శర్మ షో
- ఉర్రూతలూగిపోయన న్యాయనిర్ణేతలు
హైదరాబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ, రేపర్ కేదెన్‌శర్మ ఎంటీవీ హస్టిల్ సీజన్-3లో దుమ్మరేపాడు. అతడి షోకు న్యాయనిర్ణేతలు, ఆహూతులు మైమరచిపోయారు. ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ గాయకుడి ర్యాప్‌కు శివాలెత్తిపోయారు. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ.. ’ అంటూ స్టేజీని కిక్కెక్కించాడు.
హైదరాబాద్ కల్చర్‌ను, నగరం గొప్పతనాన్ని ర్యాప్‌లో చెబుతుంటే ఊర్రూతలూగిపోయారు. యువత కేరింతలతో కిర్రెక్కిపోయింది. ‘హలో మేడమ్ ఇదర్ మిల్తా డిస్కౌంట్’ అంటే పడిపడీ నవ్వారు. ‘రియాల్టీ చెక్ మిల్తా హర్ దూస్రీ గల్లీమే’ అంటే ఆశ్చర్యపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అస్సోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడమే కాదు.. కేదెన్‌శర్మ పాటకు ఫిదా అయిపోతూ అతడికి అభిమానులుగా మారిపోతున్నారు.
Hyderabadi #Rapp
Rocking Performance On MTV Hustle 3 #mtvhustle #rapper
Kayden Sharma pic.twitter.com/6QUvDFu4Ya— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) October 25, 2023