మెదక్ జిల్లా: త్వరలోజరగనున్న తెలంగాణ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్ల సన్నాహాలలో భాగంగా భారత ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయి లో అనేక కార్య క్రమాలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
శనివారం జిల్లా కేంద్రం లో ఓటర్ ల చైతన్యం కోసం I Vote For Sure ( నేను తప్పక ఓటు వేస్తాను ) అనే నినాదం తో స్థానిక చర్చిగేట్ వద్ద 5 కె రన్ ను కోలాహలంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు . జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ తో పాటు ప్రముఖ సినిమా హీరో సంపూర్ణేష్ బాబు ప్రముఖ టివి నటులు శ్రీధర్ రావు, వసుదే వరావులు పాల్గొని,యువతను ఉత్సాహ పరిచారు . ఓటర్ల చైతన్యం కోసం ఎన్నికల సంఘం (స్వీప్) అనే పేరుతొ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో బాగా 5 కె రన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు . అక్టోబర్ 01 ,2023 నాటికీ 18 సంవత్సరాలు దాటి స్థానికంగా నివాసముండే భారతీయ పౌరులందరూ ఓటరు గా నమోదు చేసుకోవాలన్నారు ఎంత పనివున్న తల్లి దండ్రులు తమ పిల్ల లు 18 వయస్సు నిండితే తప్పనిసరిగా ఓటర్ నమోదు చేయించాలని అన్నారు.ఎన్నికల్లో ఓటు వేసి, ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలనీ మెదక్ జిల్లా ప్రజలను కోరారు . ప్రతి ఓటర్ తమ సమీప బి ఎల్ ఓ వద్ద ఓటర్ జాబితాను పరిశీలించి తమ ఓటు ఉందొ , లేదో, చూసుకొవాలని ఒకవేళ ఓటర్ నమోదు లేకుంటే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకొని బి ఎల్ ఓలకు అందజేయాలని అన్నారు . వర్షం పడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించడం ప్రజలలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని వక్తలు కొనియాడారు .ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , తూప్రాన్ ఆర్ డి ఓ జయచంద్రారెడ్డి , జిల్లా సీపీ నోడల్ అధికారి రాజిరెడ్డి , యూత్ వెల్ఫేర్ అధికారి నాగరాజు , వివిధ మండలాల తహసీల్ధార్లు , యువకులు , ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు