హైదరాబాద్, 30 సెప్టెంబరు 2023: విభిన్నమైన కెరీర్ ఎంపికలు అందుబాటులో వున్నప్పటికీ, గణనీయమైన సంఖ్యలో భారతీయ యువత ఇప్పటికీ ప్రతిష్టాత్మకమైన IAS లేదా IPS అధికారిగా నిలువాలని కలలు కంటున్నారు. ఈ ఔత్సాహికులు తమ కలల సాధన కోసం ఢిల్లీ, పాట్నా మరియు అలహాబాద్ వంటి మహానగరాలకు వెళ్ళటంతో పాటుగా, దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణించబడే పరీక్షలో నైపుణ్యం సాధించడానికి తమ జీవితాలను అంకితం చేస్తారు. అయినప్పటికీ, ఆర్థిక పరిమితుల కారణంగా ఎంతోమంది తమ కల సాకారానికి దూరంగానే ఉండిపోతున్నారు. ఈ తరహా విద్యార్థుల కోసం, మేడ్ ఈజీ గ్రూప్ కు చెందిన నెక్స్ట్ IAS ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రోగ్రామ్ జనరల్ స్టడీస్‌లో ప్రీ-కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్సు కోసం ట్యూషన్ ఫీజులో 100% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది, ఇది ఇంగ్లీష్ మరియు హిందీలో అందుబాటులో ఉంటుంది మరియు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా ఈ స్కాలర్‌షిప్ కోసం ప్రయత్నం చేయవచ్చు.
ఈ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేదీ అక్టోబరు 5. స్కాలర్‌షిప్ పరీక్ష అక్టోబర్ 15న జరుగుతుంది. విజయవంతమైన అభ్యర్థులు తమ శిక్షణను అక్టోబర్ 26, 2023 నుండి జూలై 31, 2024 వరకు పొందుతారు. ఎక్కువమంది కి ఈ స్కాలర్‌షిప్ అందించే ప్రయత్నంలో, నెక్స్ట్ IAS దేశవ్యాప్తంగా విజయవాడ, కోల్‌కతా, వైజాగ్, ఇటానగర్, దిబ్రూఘర్, గౌహతి, జోర్హాట్, సిల్చార్, ముజఫర్‌పూర్, పాట్నా, చండీగఢ్, భిలాయ్, రాయ్‌పూర్ మరియు అనేక కీలక నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.