అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు లో గల సూపర్వైజర్ నాగేశ్వరి సెక్టార్ లోని గుత్తి పట్టణ కేంద్రాలైన స్వీపర్స్ కాలనీ , దండు మారెమ్మ గుడి, సాయిబాబా టాకీస్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడి స్కూల్ లలోని పిల్లల హాజరు శాతం, ఎత్తు బరువులు భోజన వసతులు పరిశీలించారు. గర్భవతులకు బాలింతలకు ఆరు నెలల నుండి మూడు సంవత్సరముల పిల్లలకు ప్రతి ఒక్క హక్కుదారులకు టేకు హోం రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని అంగన్వాడి టీచర్లకు హెచ్చరించారు. తదనంతరం నమోదు చేయబడిన రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గంగాదేవి భారతి చంద్ర లీల సహాయకులు సునీత మస్తానమ్మ సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.