త్రిపురాంతకం : ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు యర్రగొండపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జి కోటయ్య ఆధ్వర్యంలో మైనర్లు రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురి అవుతూ, లేదా వారి వలన వేరే వారు ప్రమాదాల బారిన పడటం జరుగుతుందని, కనుక ఇలాంటి ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా మంగళవారం ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించారు.
డ్రైవింగ్ చేస్తున్న మైనర్ పిల్లలను ఆపి వారి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ మధ్య జరిగిన ప్రమాదాలను వివరిస్తూ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కేసు నమోదు అయితే దాని తదనంతర పరిణామాల గురుంచి వారికి క్రుణ్ణంగా వివరించారు. ప్రతి ఒక్క తల్లి తండ్రి మైనర్లకు (18 సంవత్సరాలు నిండని వారికి) ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇచ్చి ఏదైనా చిన్న చిన్న వస్తువులు తీసుకురమ్మని అలవాటు చేయడం కూడా తప్పిదమవుతుందని కనుక ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు.
ఇక మీదట యర్రగొండపాలెం టౌన్ లో ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికినట్లైతే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.