అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సిఐటియు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సత్యాసాయి కార్మికుల సమ్మెలో భాగంగా 15 రోజు గాంధీ సర్కిల్ నుండి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సత్య సాయి కార్మికుడు భాష మరియు సిఐటియు మండల అధ్యక్షులు మల్లేషు మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ సత్యసాయి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బకాయి పడ్డ ఆరు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని క్యూఏ నివేదిక రద్దు చేసి పాత విధానం కొనసాగించాలని సత్యసాయి కార్మికులకు బడ్జెట్ కేటాయించాలని పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు సత్య సాయి కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే అన్ని కార్మిక సంఘాలు ఏకమై దశలవారీగా పోరాటాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కృష్ణమాచారి జోసెఫ్ నాగభూషణం నాగరాజు తదితరులు పాల్గొన్నారు