కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో గల (శృతిజ్ఞ) ఉపజ్ఞ హోమ్స్ పేరుతో అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. వీటిపైన 11/03/2024 న కి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కలెక్టర్ అధికారులను మోకా ఎంక్వైరీ కి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా అధికారులు 19/04/2024 శుక్రవారం నాడు తనిఖీలు చేపట్టగా ఉపజ్ఞ హోమ్స్ లో పార్కు ప్లేసులో 9 డూప్లెక్స్ నిర్మాణాలను ఎలాంటి అనుమాతులు లేవని గుర్తించడం జరిగింది. అపార్ట్మెంట్ కింద సెల్లార్లో పార్కింగ్ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ మూడు ఇండ్లు నిబంధనలకు విరుద్ధంగా కట్టినారు వాటిని కూడా తనిఖీ చేసినారు.అలాగే 690 ఎస్ ఆర్ ఎస్ పి స్థలంలో ఏడు డూప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. హోమ్స్ మెయిన్ గేటు ఎదురుగా అబ్రెడ్డి కుంట మత్తడి మీదనే ఎదురుగా మెయిన్ గేటు నిర్మాణం జరిగింది. దాని ప్రహరీ గోడ కూడా కుంట శిఖo ఆనుకొని నిర్మించినారు వీటన్నిటిని అధికారులు గుర్తించినారు. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు చూడగా ఎక్కడ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అని లేదు 15/03/2024 లో సమాచార హక్కు చట్టం ద్వారా అడగగా ఎలాంటి పర్మిషన్స్ మేము ఇవ్వలేదని గ్రామ పంచాయతీ నుంచి సమాధానం ఇవ్వడం జరిగింది ఇది చూసిన అధికారులు మరి అక్కడున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం పర్మిషన్ స్టాంపు సంతకాలు ఎవరిచ్చారు ఎలా వచ్చాయని కార్యదర్శిని వివరణ కోరారు అతను ఏమి సమాధానం చెప్పలేకపోయాడు దీనిపై పూర్తి సమాచారం కావాలని అధికారులు కార్యదర్శిని ఆదేశించారు. వీటన్నిటి పైన సమగ్ర విచారణ జరిపి నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి తెలియపరుస్తామని డిఎల్పిఓ చెప్పడం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి సిపిఐ నాయకులు మరియు గ్రామస్తులు మాచర్ల అంజయ్య కిన్నెరసారయ్య సంగుపట్ల మల్లేశం మరియు హోమ్స్ లో ఉన్నటువంటి బాధితులు పాల్గొనడం జరిగింది.
