- అందాల అరకులో అధికారుల అండ దండలతో యదేచ్చగా షాప్ నిర్మాణం
అల్లూరి జిల్లా, అరకువేలి: అరకువేలి మండలం లోని పద్మాపురం పంచాయతీ పరిధి యండపల్లివలస లోని కెనరా బ్యాంకు ఎదురుగా ఓ గిరిజనేతరుడు గిరిజనుడు పేరు మీద బినామీ పత్రాలు సృష్టించి గేటు నిమిత్తం కొంత స్థలాన్ని కబ్జా చేసి.. పంచాయితీ అధికారికి భారీ మొత్తంలో ముడుపులు అందించిన అక్రమంగా దుకాణ నిర్మాణం చేపడుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.దీనిపై పాడేరు జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలని పలువురు స్థానిక గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.అలాగే అరకులోయ పట్టణ పరిసర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలకు సహకరిస్తున్న అధికారులపై తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసు కోవాలని పలువురు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.