- సెలవు రోజులు చూసుకొని అక్రమ నిర్మాణాలు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
అల్లూరి జిల్లా, హుకుంపేట: సందడిలో సడే మియా అన్నట్టు ఎన్నికలు వేల ఎవరు పట్టింపులు చేయాలేరని నిర్ధారించుకుని మండల కేంద్రంలో జోరుగా అక్రమ కట్టడాలు కడుతున్నారు. ఖాదర్ అనే గిరిజనేతరుడు కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకుని. రెండంతస్తులు స్లాబు బుధవారం సెలవు చూసుకొని నిర్మించుకున్నారు. గిరిజనులు చిన్న దుకాణం వేస్తే ఆగమే గలిగా తొలగించే రెవిన్యూ అధికారులు మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు కనబడలేదా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకే నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో జోరందుకున్న అక్రమ కట్టడాల నిలుపుదలకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో, రెవిన్యూ అధికారుల ప్రోత్సాహంతోనే మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నట్టు ప్రజాసంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు. . ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలపై నిలుపుదల చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలపై వేటు వేయకపోతే, పూర్తిగా అక్రమ నిర్మణాలను కూల్చివేయకపోతే .. అధికారుల నిలక్ష్య వైఖరి పై అధికారుల పై కేసులు పెడతామని హెచ్చెరించారు. చట్టం దృష్టిలో అందరు సమానమేనని, తప్పు చేస్తే ఎవరైనా శిక్షకు పాత్రులు కావాల్సిందేనని తెలిపారు. ప్రజలు అధికారుల పై కేసులు పెడితే అధికారుల పరిస్థితి ఏంటో చూసుకోండి ? గిరిజనులు అమాయకులు కదా ! ఏమైనా చేయొచ్చు.. అనుకుంటున్నారు ! ప్రజలలో చట్టాలపై అవగానే వస్తే .. తాట తీస్తారు.
పబ్లిక్ సర్వెంట్ నిర్లక్ష్యంగా – సెక్షన్ 129:
పబ్లిక్ సర్వెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే – సెక్షన్ 129 ప్రకారం శిక్షింపడతాడు. నిర్లక్ష్యం అనేది అజాగ్రత్త లేదా బాధ్యతను ఉల్లంఘించడం అని అర్ధం. నిర్లక్ష్యానికి సాధారణంగా భాషలో ఎవరైనా కొంత బాధ్యతను నిర్వర్తించడంలో అసమంజసంగా అలసత్వం వహించారని అర్థం. సెక్షన్ 129 ప్రకారం “ప్రభుత్వ సేవకునిగా ఉండి, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ప్రజలకే కాకుండా దేశ భద్రతకు కూడా అవాంఛనీయ ప్రమాదం ఏర్పడుతుంది. ఈ రకమైన నిర్లక్ష్యానికి పాల్పడే ప్రభుత్వ సేవకులకు 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కోర్టు ఆమోదించిన డిక్రీతో శిక్షించబడతాయి.