అల్లూరి జిల్లా హుకుంపేట గిరిజనులకు కల్పించిన 1/70 భూ బదలాయింపు చట్టాన్ని ధిక్కరించి మండలంలోని బరోడా బ్యాంక్ . గవర్నమెంట్దు హై స్కూల్ ఎదురుగా గిరిజనేతరులు అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు. అరకు, పాడేరు ప్రధాన రోడ్డు కిరువైపులా శాశ్వత గృహ నిర్మాణాలు షాపులు నిర్మించుకుంటున్నా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమకట్టడాలపై రెవిన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్థానికులు గిరిజన సంఘం నాయకులు కోరారు.