- గ్రామాలని మత్తులో ముంచేస్తున్న బెల్టుషాపులు..
- ఒరిస్సా మద్యం హుకుంపేట కేంద్రంలో అధిక రేట్లకు అమ్మకాలు
- షాపు లపై సంబంధించిన అధికారులకు ప్రేమేందుకో..,?
- ప్రభుత్వ మద్యం షాపు వాచ్ మెన్ లు మద్యం ఓలేసేల్ వ్యాపారం
- బెల్టుషాపులలో కల్తీ చేసి అమ్ముతున్నారనే మందుబాబులు ఆరోపణలు
- 24 గంటలు అందుబాటులో వుండేటట్టు సేవలు
అల్లూరి జిల్లా, హుకుంపేట: మండలంలో మద్యం ఏరులై పారుతోందని అని చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే వీధి వీధిన, ఇంటి పక్కన.. ఇలా ఎక్కడ చూసినా మద్యం బెల్టు షాపులే. ఫోన్ కొడితే ఇంటికే మద్యం డెలివరీ అవుతోంది. అధికారులు చెప్పే మాటలన్నీ నీటిమూటలేనని.. వాస్తవం వేరని చెప్పడానికి మండలంలో వాడ, పల్లె అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్న బెల్టుషాపులే సాక్ష్యాలు. అధికారుల అండదండలతో 3 పెగ్గులు, 6 గ్లాసులుగా ఈ వ్యాపారం వర్థిల్లుతోంది. ఇక్కడ మద్యం కాకుండా ఒరిస్సా నుంచి ఆటో లలో తీసుకొని వచ్చి అధిక రేట్లకు అమ్మకాలు చేస్తున్నారు ఊళ్లని మత్తులో ముంచేస్తున్న బెల్టుషాపుల దుకాణాలపై చర్యలు మాత్రం లేవు సంక్రాంతి ,కనుమ , రోజుల్లో అధిక ధరలు విచ్చలవిడిగా అమ్మకాలు చెప్పటారు
ది రిపోర్టర్ టీవీ ప్రత్యేక కథనం:
ఊళ్లలో ఏరులై పారుతున్న మద్యం “ఏదైనా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఉందో లేదో తెలియదు కానీ బెల్టు షాపులు లేని గ్రామం లేదు. ఫోన్ కొడితే మినరల్ వాటర్ వస్తుందో లేదో తెలియదు కానీ, మద్యం సీసాలను నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాయి. ప్రతి మనిషినీ ఎలా తాగుబోతును చేయాలా అనే ఆలోచనతోనే బెల్ట్ దుకాణాలను గ్రామస్థాయి వరకు తీసుకువచ్చారు. మండలంలో బెల్టుషాపు ఇప్పుడున్న క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదు. హుకుంపేట మండల కేంద్రం తో పాటు ఉప్ప , బాకురు, తదితర గ్రామాల వరకూ ఏ గల్లీలో చూసినా బెల్టుషాపులే. చిల్లర దుకాణాలు,పర్మిట్ రూమ్, కిరాణా కొట్లు, కూల్డ్రింక్ షాపులు ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే. మరికొందరైతే ఇళ్లనే బెల్టు షాపులుగా మార్చేసి నడిపిస్తున్నారు. ప్రభుత్వ వైన్స్ దుకాణాల నుంచే వీటికి మద్యం సరఫరా అవుతోంది. లేకుంటే ఒడిశా బోర్డర్ 15 కిలోమీటర్ల దూరం కాబట్టి అక్కడ నుంచి తెచ్చి అమ్మకాలు చేస్తుంటారు. మండలంలోని గ్రామాల్లో మొత్తం సుమారు 20 కు పైగా బెల్టుషాపులు లెక్క తేలాయి. తక్కువలో తక్కువ ఊరికి రెండు, మూడు నుంచి ఐదు , ఆరు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ దుకాణాల నిర్వహణలో వైన్స్ నిర్వాహకుల మద్దతుదారులు, సానుభూతిపరులదే ప్రధాన పాత్ర. ప్రభుత్వ మద్యం షాపులో నైట్ వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న జీతాలు చాలక మద్యం ఓలేసేల్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో వైన్స్ నిర్వాహకులు బెల్టుషాపుల ద్వారా ప్రజల్ని దోచుకుంటున్నారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ బెల్టుషాపు వద్ద చూసినా సరే ‘పర్మిట్’ లేని రూమ్లే కనిపిస్తున్నాయి. వాటిలో అడ్డగోలు అమ్మకాలే దర్శనమిస్తున్నాయి. బెల్ట్ షాపులకు వైన్స్ దుకాణాల నుంచే మద్యం సరఫరా అవుతోంది. అక్కడ పనిచేసే వాచ్ మెన్ ల ద్వారా బెల్టు షాపుల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఒక్కో సీసాపై అదనంగా 10 నుంచి 15 రూపాయల చొప్పున తీసుకుని కావాల్సినవన్నీ అందిస్తున్నారు. బెల్టు షాపులవారు వాటిని గ్రామాలకు తీసుకెళ్లి.. ఆ రేటుపై అదనంగా మరో 50 నుంచి 70 రూపాయలు వసూలు చేసి మందుబాబులకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసిచూడనట్టిగా వ్యవహరిస్తున్నారు . ప్రభుత్వ వైన్ షాప్ లో ఒక మనిషి కి 3 బొటల్స్ మాత్రమే అని చెప్పి బెల్ట్ షాపులలో అమ్ముకునే వారికి మాత్రం బాక్స్ లు బాక్స్ లు ఇస్తున్నారు . 24 గంటలు రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చల విడిగా మద్యం ఆముకుంటున్నారు.. ఇది ఇలా ఉంటే బెల్ట్ షాప్ యజమానులు బొటల్స్ కల్తి చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.. ప్రభుత్వ మద్యం షాప్ లో షీల్ వేసి ఇచ్చి నప్పటికి ఆ షీల్ ని అలానే తీసి అందులో కొంచెం మద్యం తీసి ఓటర్ లేదా స్పిరిట్ వేసి అందులో నీళ్ళు కలిపి సీల్ వేసి అమ్ముతున్నారని కొందరు మందుబాబులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా ! లేదా ! వేచి చూడాలి.