contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆకు చాటున తరలిపోతున్న నాటు సారా .. !

  • ఒరిస్సా నుంచి ఆంధ్రకు తరలిపోతున్న నాటు సారా
  • అక్రమ బెల్టుషాపుల దందా
  • కల్తీ నాటు సారా హావా

 

అల్లూరి జిల్లా హుకుంపేట: మండల కేంద్రంలో పెట్రేగిపోతున్న నాటు సారా, బెల్ట్ షాపుల దందా. సంక్రాంతి పండగ దగ్గర కావడంతో ఒరిస్సా నుంచి ఆంధ్రా కు అక్రమ మద్యం భారీ ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాట్లు సమాచారం. ఒరిస్సా బ్రాండ్లతో బ్లాక్ లో మండల కేంద్రంలో పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. పోలీస్ శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మకానికి భారీ గిరాకి వస్తుండడంతో బెల్ట్ షాపు దారులు కొత్త కొత్త బ్రాండ్లతో అమ్మకానికి తెర తీశారు. కల్తి మద్యం సేవించి కొందరు అనారోగ్య బారిన పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వం బ్లాక్ లో బెల్ట్ షాపులు అమ్మకం నిషేధించినప్పటికీ పోలీస్ శాఖ కళ్ళు కప్పి ఆకు చాటున జోరుగా అమ్మకాలు జరుపుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనయిన ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :