- సింగరుట్ల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ భూమి లో అక్రమ మైనింగ్కారంపూడి : రెచ్చిపోతున్న మైనింగ్ – పట్టించుకోని అధికారులు
- ట్రాక్టర్ లతో మట్టిని తరలిస్తున్న పట్టించుకోని అధికారులు
- మామూళ్ల మత్తులో కారంపూడి దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు
పలనాడు జిల్లా కారంపూడి :మండలంలోని సన్నిగళ్ల గ్రామ పరిధిలో ఉన్న ఎంతో శక్తివంతమైన సింగరుట్ల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి సుమారు వందల ఎకరాల భూమి ఉంది. ఈ భూములు ఎంతో విలువ కలిగినవి. ఈ భూములు ఎంతో విలువైన రెడ్ స్టోన్ సాయిల్ కలిగి ఉన్నవి. ఈ భూమిలో ఉన్న మట్టిని కొంతమంది ట్రాక్టర్ ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు.
ఇదంతా పట్టపగలు బహిరంగంగా దేవాలయ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ విధంగా పదుల సంఖ్య లో ట్రాక్టర్ ల ద్వారా మట్టిని తరలిస్తుంటే దేవాలయ అధికారులు ఏం చేస్తున్నారు అన్నది గ్రామస్తులు సన్నిద్ధంలో ఉన్నారు ఆ యొక్క ఆలయానికి సంబంధించిన అధికారులు ఈ యొక్క అధికారులు ఏమైనా మామూళ్ల మత్తులో ఉన్నారేమోనని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా దేవాలయ జిల్లా ఉన్నత అధికారులు ఒకసారి సింగరుట్ల దేవస్థానం వైపు చూసి దేవస్థానం భూములను కాపాడాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.