మెదక్ జిల్లా మనోరాబాద్ : జిల్లాలో మట్టి మాఫియా చెలరేగుతోంది. వారు విదిల్చే కాసుల కు ప్రభుత్వ అధికారులు కక్కుర్తి పడుతున్నారు. దీంతో మట్టిని అక్రమంగా తరలించే అక్రమార్కు లకు బ్రేకులు వేసేవారే కనిపించడం లేదు. మనోరాబాద్ మండలంలోని పలాట అటవీప్రాంతం నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వి తీసుకొని వెళుతున్నా రు. ఎక్కడ పడితే అక్కడ ఎక్సకవేటర్లతో తవ్వి ట్రాక్టర్లతో, టిప్పర్లతో తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటు న్నారు. వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, గ్రామ కార్యదర్శులు, పోలీసులు గ్రామస్థాయలోనే ఉంచినప్పటికీ మట్టి తవ్వకాలు మాత్రం బహిరంగంగా జరుగుతు న్నప్పటికీ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఫిర్యాదులు వస్తే ఒకటిరెండు ట్రాక్టర్లను సీజ్ చేసి ఫైన్ వేసి చేతులు దులుపుకుంటు న్నారు. మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి
