పల్నాడు జిల్లా గురజాల : ది రిపోర్టర్ టివి రేషన్ మాఫియా పై వేసిన కథనాల పై స్పందించిన అధికారులు , గురజాల పట్టణం లో అక్రమంగా తరలిస్తున్న 94 బస్తాలు రేషన్ బియ్యన్నీ గురజాల ఎస్ఐ బి.అనంతకృష్ణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. స్థానిక బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ మినీ లారీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించి వాహనాన్ని ఎస్సై స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం గోగులపాడు నుంచి అంబాపురం మీదగా గురజాల వచ్చిందని, లారీలో 94 బస్తాల రేషన్ బియ్యం ఉన్నాయని మీడియా కి ఎస్ ఐ అనంత కృష్ణ తెలియజేసారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం రెంటచింతల మండలానికి చెందిన అదికార పార్టీకి చెందిన ఒక నాయకుడిదని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.