సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ పల్లి (ఎరవెల్లివడా) లో మహిళా గ్రామ ఐక్య సంఘ భవనాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిద్ధిపేట జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాంభించారు,ఈ సందర్భంగా జిల్లాపరిషత్ చర్మన్ రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని, మహిళ సహధికారతే లక్ష్యంగా ప్రభుత్వం యంత్రాంగం పని చేస్తోంది అనీ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎరవెల్లి మమత, ఏ.పి.ఎం నర్సయ్య, సీసీ సారయ్య, గట్టు సరిత, వి.ఓ.ఏ లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు,
