విజయనగరం జిల్లా రాజాంలో గంజాయి కల్తీ మధ్యం మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. సాయంత్రం వేళ ఇలా మత్తులో తులుతూ రోడ్లపై వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న తీరు కనబడుతుంది. ఈరోజు బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులను ప్రశ్నించిన స్థానికులపై యువకులు దాడి చేశారు. దింతో స్థానికులు అల్లరి మత్తులో ఉన్న యువకులకు దేహ శుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అప్పటికే మరో ఇద్దరు యువకులు పరార్ అయ్యారని స్థానికులు చెపుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పోకిరిలకు సరైన శిక్ష విధించి ఆడవాళ్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.