ఉక్రెయిన్ లో నానాటికీ రష్యా దాడులు తీవ్రమవుతున్నాయి. రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలను చేజిక్కించుకునే క్రమంలో రష్యా దళాలు భారీ ఎత్తున క్షిపణి దాడులు చేస్తుండడంతో, జనావాసాలపైనా ప్రభావం కనిపిస్తోంది. రష్యా దాడుల భయంతో ఉక్రెయిన్ ప్రజలు లక్షలాదిగా దేశం విడిచి వెళ్లిపోతుండగా, భారతీయుల సహా అక్కడున్న విదేశీయులు స్వదేశాలకు చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో, రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల సహా విదేశీయులను ఉక్రెయిన్ నుంచి వెలుపలికి తరలించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో తరలింపు చర్యల కోసం 130 బస్సులు ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ లోని ఖర్కీవ్, సుమీ నగరాల నుంచి విదేశీయులను రష్యాలోని బెల్గోరోడో ప్రాంతానికి బస్సుల ద్వారా తరలించనున్నారు. అక్కడి నుంచి విదేశీయులు తమ దేశాలకు వెళ్లవచ్చు.
కాగా, భారత్ ఇప్పటివరకు ఉక్రెయిన్ పొరుగుదేశాలైన రొమేనియా, హంగేరీల మీదుగా విద్యార్థులను తరలిస్తోంది. ఇంకా ఉక్రెయిన్ లో చాలామంది భారత విద్యార్థులు