- ప్రభుత్వ వైఫల్యం వల్ల వరుస మరణిలే తెలుగుదేశం పార్టీ ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర
అల్లూరి జిల్లా హుకుంపేట: గిరిజన ప్రాంతంలో ఆగని శిశు మరణాలు ప్రభుత్వ వైఫల్యం వల్ల వరుస మరణిలే జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర అన్నారు. మండలంలోని మత్స్యపురం పంచాయితీ ఊట్ట గడ్డ గ్రామానికి చెందిన కొర్ర సుబ్బారావు సుందరమ్మ దంపతుల మూడు నెలల బాబు హఠత్తు శనివారం రాత్రి మరణించిన విషయం తెలుసుకుని ఆదివారం ఉదయం గ్రామంలో పర్యటించి కొర్ర సుబ్బారావు,సుందరమ్మ దంపతులకు ఓదార్చారు. అనంతరం అయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో శిశు మరణాలు నిత్యం జరుగుతున్నాయని ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి శిశు మరణాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. అయనతో పాటు మత్య్సపురం సూపర్ సర్పంచ్ సుబ్బా రావు సూపర్ ఎంపిటిసి సాంబ, మాజీ సర్పంచ్ రాజారావు అరకు అసెంబ్లీ ఎస్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొర్ర సంతోష్ కుమార్ సెక్రటరీ కిల్లో జగన్ కుమార్ అధికార ప్రతినిధి శంకర్ నాయడు మత్య్సరాజు దొర స్థానిక పాస్టర్ అబ్రహాం, మహేష్ శ్రీను కొర్ర జోగులు తామష్ గ్రామస్థులు పాల్గొని నివాళర్పించారు.