అల్లూరి జిల్లా హుకుంపేట:మండలం లో పలు చెట్ల ఆగని శిశు మరణాలు ముక్కుపచ్చలారని చిన్నారి ఒకేరోజు అనారోగ్యం బారిన పడి వాంతులు విరోచనాలతో ఆదివారం రాత్రి మరణించింది.మండలంలోని భీమవరం పంచాయతీ రామచంద్రపురం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు గెమ్మెలి భీమేశ్వరరావు నాగమణి లకు కుమార్తె పుట్టి మూడు నెలలు అయింది. ఆరోగ్యంగానే ఉంటూ శనివారం సాయంత్రం కాస్త నీరసంగా ఆడుకోవడం జరిగిందిని తల్లి తండ్రులు అన్నారు.పుట్టి ఎన్నిలు కాకుండా నే కళ్ళముందే కటికి చేరడం వారి తల్లిదండ్రులకు శోకసముద్రంలో మంచి వేసింది. దీంతో ఆ గ్రామానికి విషాద ఛాయలు అల్లుకుంది. అంతుచికని వ్యాధులతో చిన్నారులు మృతి పట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సాదించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో శిశు మరణాలు జరుగుతూనే ఉన్నాయి. మరణాలపై జిల్లా వైద్యాధికారులు దృష్టి సారించకపోవడం వల్లే మరణాలు జరుగుతూనే ఉన్నాయని గిరిజన సంఘ నేతలు టి. కృష్ణారావు వాపోయారు. చిన్నారి మృతులకు ప్రభుత్వ ఆరోగ్య శాఖ వైఫల్యమే కారణమని గిరిజన సంఘ నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా చిన్నారులు మరణాలపై దృష్టి సాధించాలని లేకుంటే బాధితులతో కలిసి ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.