- మా పిల్లలు మట్టి తిని బతకాల పిఓ సారూ!!
- 33మంది పిల్లలకు అందని మధ్యాహ్నం భోజనం పథకం.
- విద్యార్థులు,తల్లిదండ్రులు ఖాళీ కంచలతో నిరసన
అల్లూరి జిల్లా,అనంతగిరి : అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం పరిధిలో గల కివర్ల పంచాయితీ, పూతుకు పుట్టు, జగడల మామిడి గ్రామంలో 33 మంది పిల్లలుఎంపీపీ స్కూలు పుట్టు గ్రామంలో చదువు కుంటున్నారు. ఈ కొండ శిఖర గ్రామాలకు మా గ్రామం నుండి కవర్ల డిపో కి వెళ్లి స్లిప్పులు ఇస్తున్నారు కానీ బియ్యం రావడం లేదని చెప్పడంతో మా పిల్లలు మట్టి తిని బతకాల మేము మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్లి చదువుకోవాలా అంటూ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఖాళీ కంచలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ..కావున తమరు మాకు మధ్యాహ్నం భోజన పథకం బియ్యం ఇప్పించవలసిందిగా కోరుతున్నామని,విద్యార్థి తల్లిదండ్రులు మాదల కొండబాబు సిహె.భవాని శంకర్ ,మాదల లక్ష్మి, మాదల రాములమ్మ, తదితరులు డిమాండ్ చేశారు.