గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాల పేరిట ఆదాయపన్ను శాఖ (ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రానైట్ కంపెనీలను నిర్వహిస్తున్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపైనా అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ లోని గంగుల ఇంటికి బుధవారం ఉదయం చేరుకున్న అధికారులు…ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పగుల గొట్టి మరీ ఇంటిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
గంగుల తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం దుబాయిలో పర్యటిస్తున్నారు. ఐటీ, ఈడీ అధికారులు తన ఇంటిపై దాడి చేశారన్న వార్త తెలియగానే… ఆయన దుబాయి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. నేటి రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకుని నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ రాగానే ఐటీ, ఈడీ దాడులపై ఆయన దృష్టి సారించనున్నారు.