పార్వతీపురం మన్యం జిల్లా : సీతంపేట, రంపచోడవరం, పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో విస్తృతంగా జరుగుతున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్‌టీ) అక్రమ నియామకాలు, క్రమబద్ధీకరణలపై లోతైన విచారణ జరిపించాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నియామకాలలో ఎక్కువ భాగం రాజకీయ సిఫార్సులు, లంచగొండితనం మరియు బంధుప్రీతితో ప్రభావితమయ్యాయని, ప్రభుత్వ నిబంధనలు మరియు చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన:
ప్రభుత్వ చట్టం 30 ప్రకారం, CRTల చట్టపరమైన క్రమబద్ధీకరణకు అనేక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి:
1. క్లియర్ వేకెన్సి లోనే నియామకం జరగాలి.
2. తొలి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఉండి ఉండాలి.
3. బాండ్ పేపర్ ఉండాలి.
4. వెకేషన్ పీరియడ్ మించి సర్వీస్ బ్రేక్ ఉండరాదు.
5. సరైన నోటిఫికేషన్ ద్వారా నియామకం జరిగి ఉండాలి.
6. నియామకాలలో రోస్టర్ ను అనుసరించాలి.
అయితే, ఈ మార్గదర్శకాలను పెద్దగా పట్టించుకోలేదని నివేదికలు సూచిస్తున్నాయి. క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు అనేకసార్లు తిరస్కరణకు గురైనప్పటికీ, చాలా మంది CRTలు లేని పత్రాలు కల్పించి మరియు పై అధికారులను లంచాల ద్వారా రాజకీయ సిఫారసు ల ద్వారా తమ పోస్టింగ్ లు దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అనర్హులకు కూడ CRT లుగా కొనసాగించడం – అర్హులైన CRT లకు అన్యాయం చేయడం :
సీనియారిటీలో వెనక ఉన్న వారికి ముందు రెగ్యులర్ చేయడం, SA(PD) అర్హతలు ఉన్నప్పటికి, PET గా పోస్టింగ్ ఇవ్వడం వంటివాటి వలన తీవ్రంగా నష్టపోయినట్టు కొందరు CRT లు ఆవేదన చెందినట్టు సమాచారం.
ఆయా Subject లకు అవసరమైన అర్హతలు లేని వారిని కూడ CRT లుగా నియమించడం జరిగింది. Biological Science Subject కొరకు లో Botany/Zoology Compulsory Subject అయి ఉండాలి. కాని Biotechnology, Microbiology వారిని కూడ నియమించి కొనసాగించినట్టు తెలుస్తోంది. అలాగే CRT లుగా చేరే నాటికి TET లేకుండా, తర్వాత TET లు PASS అయినట్టు కూడ ఆరోపణలు ఉన్నవి. Notification లో స్వీకరించిన ధరఖాస్తులలో Merit వారిని పక్కన పెట్టి, సిఫారసుల ద్వారా వారికి నచ్చిన వారిని Merit లో లేకపోయినప్పటికి List లో సర్దుబాటు చేసినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
అవినీతి,రాజకీయ ప్రభావం:
సీఆర్‌టీ యూనియన్ నాయకులు రాజకీయాలలో నిమగ్నమై, వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు ఉద్దేశపూర్వకంగా ప్రతీ ఏటా ప్రకటించాల్సిన CRT రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను మరియు ప్రత్యేక గిరిజన DSC రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకుంటున్నారు. అంతేకాక మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ముడుపులు తీసుకుని ఖాళీ స్థానాలలో CRT లను వేయించడం, నచ్చిన స్థానాలను ఇప్పించడం చేస్తున్నారు. ఇలా 12 సంవత్సరాలకు పైగా డబ్బుతో విధ్యా వ్యవస్థను అవినీతి మయం చేసి నిరుద్యోగాన్ని మరింత పెంచుతున్నారు. ఇందు వలన వేలాదిమంది CRT ల కంటే ఉన్నతమైన మెరిట్ కలిగిన అభ్యర్ధులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ఈ ప్రక్రియ వలన గిరిజన విధ్యా వ్యవస్థలో నాణ్యత ప్రశ్నార్ధకం చేస్తున్నారు.
రెగ్యులర్ టీచర్స్ పట్ల పక్షపాత ధోరణి:
అంతేకాక సర్వీస్ రూల్స్ ప్రకారం రెగ్యులర్ టీచర్ల కోసం ఉద్దేశించిన 70 % పదోన్నతులు కోటాలో కూడ తిష్టవేసి సాధారణ మధ్యంతర కోర్టు ఉత్తర్వులు సాకుతో ప్రమోషన్స్ ఆపేసి, అదే స్థానంలో వీరిని కొనసాగించడం మరిన్ని అనుమనాలకు తావు ఇస్తోంది.
ఎన్నో సార్లు ఉపాద్యాయ సంఘాలు పలు మార్లు క్షేత్ర స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం వరకు వినతులు ఇచ్చినా CRT ల వైపే పక్షపాతంగా వ్యవహరించడం ఆశ్చర్యకరం. కోర్టు ఉత్తర్వులు యందు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు CRT లు గానే కొనసాగించమని Status Quo ఇచ్చినా, కోర్టు ఉత్తర్వులు అధిగమించి మరియు ఎలక్షన్ కోడు అమలులో కూడ చట్టవిరుద్ధంగా CRTలకు మేలు చేశారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రమోషన్స్ కౌన్సిలింగ్ జరిగిన తదుపరి CRT లకు స్థానాలు కేటాయించాలని సంఘాలు అభ్యర్ధించినా వారి వినతులు త్రోసి పుచ్చి CRT లకు నచ్చిన స్థానాలు కేటాయించినట్టు అందుకోసం గట్టిగా ముడుపులు సమర్పించినట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా Sanctioned పోస్టుల జీవో 10 పై కేసులు ఉన్నాయి కనుక కేసు తేలేవరకు ప్రమోషన్స్ ఇవ్వలేమని చెప్పిన అధికారులు, గత సంవత్సరం Notification, Subject Wise Merit లిస్ట్, Vacancy లిస్ట్ ఏవి బయటపెట్టకుండా సైలెంట్ గా Maths, Physics, PD వారికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో CRT వారు Office వద్ద గొడవ చేయడంతో Biology, English వారికి మాత్రం ఆపేశారు. జీవో 10 పోస్టులలో నియామకాలు జరగకూడదు అని అనుకుంటే పైన అన్ని సబ్జెక్టులలో కూడ నియామకాలు జరగకూడదు మరియు CRT ల రెగ్యులరైజేసన్ జరగకూడదు. కాని Biology, English సబ్జెక్టులు తప్ప అన్ని జరిగాయి. కొందరు CRT నాయకులు రాజకీయ అండదండలతో ధన ప్రభావంతో కూడిన ఒత్తిడి వలననే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు ITDA ఉద్యోగులలో వినిపిస్తున్నాయి. ఇలా ప్రమోషన్స్ కోసం చర్చకు వచ్చిన ప్రతీసారీ CRT నాయకులు ప్రత్యక్షమై అధికారులను, రెగ్యులర్ టీచర్లను బెదిరిస్తు భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు.
ఇతర Department లలో ఆగిన రెగ్యులర్ ప్రక్రియ:
CRTల నియామక ప్రక్రియ కంటే మరింత పారదర్శక ప్రక్రియల ద్వారా రిక్రూట్ అయిన ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల అధ్యాపకులు వంటి ఇతర విభాగాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి క్రమబద్ధీకరణ అభ్యర్థనలను తిరస్కరించారు. కాని ఎటువంటి ఓపెన్ Written Test లేని CRT లను రెగ్యులర్ చెయ్యడం CRTలకు అనుకూలమైన వ్యవస్థాగత అవినీతిని ప్రతిబింబిస్తుంది. మరియు వివిధ విద్యా రంగాలలోని నిజమైన రిక్రూట్ చేయబడిన సిబ్బంది యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.
నిరుద్యోగ మరియు ప్రజా సంఘాల నిరసన మరియు న్యాయం కోసం డిమాండ్
సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం మొదలగు ITDA ల నుండి వివిధ నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ అవకతవకలపై తక్షణ మరియు సమగ్ర విచారణకు పిలుపునిచ్చాయి. నిరుద్యోగ యువత, విద్యావేత్తలు మరియు ప్రజా సంఘాలు ఇటివంటి భయంకరమైన అవినీతి ఉపాధి అవకాశాలకు మరియు విద్యా వ్యవస్థ యొక్క సమగ్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని వాదిస్తున్నారు.
సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, పాడేరు మున్నగు ఐటీడీఏల్లో సీఆర్టీల అక్రమ నియామకాలు, రెగ్యులరైజేషన్లపై విచారణ జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ CRT లను రెగ్యులర్ చేసిన విధానం లేదు అని వాపోతున్నారు. కావునా ఈ తీవ్ర అవినీతిపై తక్షణమే నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగు చర్యలు తక్షణమే తీసుకుని విధ్యా వ్యవస్థ ను పరిరక్షించాల్సినదిగా నిరుద్యోగ, ఉద్యోగ, గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.