కరీంనగర్ జిల్లా: ప్రజాహిత యాత్రలో భాగంగా గన్నేరువరం మండల కేంద్రానికి బండి సంజయ్ చేరుకోగా తాసిల్దార్ కార్యాలయం ముందు గన్నేరువరం బ్రిడ్జి జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తానని గత పార్లమెంట్ ఎలక్షన్లో హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు హామీ నెరవేర్చకుండా మళ్లీ పార్లమెంట్ ఎలక్షన్ ఉండగా బండి సంజయ్ గన్నేరువరం పర్యటనకు వస్తున్న సందర్భంగా బ్రిడ్జి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్టు అయిన వారిలో బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు పుల్లెల జగన్, ప్రధాన కార్యదర్శి బామండ్ల రవీందర్, కమిటీ సభ్యులు కయ్యం సంపత్ లు ఉన్నారు.
