ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సీఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఈ సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపించారు.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. కూటమికి 165 సీట్లు రాగా, వైసీపీ 10 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ప్రమాణస్వీకారం, క్యాబినెట్ ఏర్పాటు తదితర అంశాలపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.