ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు జగనన్నేనని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా అన్నారు. “జగనన్నే మా భవిష్యత్తు” అనే కార్యక్రమాన్ని శనివారం తిరుపతిలోని 27డివజన్ మల్లయ్య గుంటకట్టలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నగర మేయర్ డాక్టర్ శిరీష.., ఇంటింటి కెళ్ళి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మన భవిష్యత్తు జగనన్నే అని.., ఆయన్ను తామంతా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆ డివిజన్లోని ఇంటింటికెళ్ళీ.. “మా నమ్మకం నువ్వే జగన్” అనే స్టికర్ను అతికించి ముందుకు సాగారు మేయర్. ప్రజా సంక్షేమం కోరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డులోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు భరణి యాదవ్, తులసి, సురేష్, రమేష్, గీతా యాదవ్,వెంకట ముని, కార్యకర్తలు,వార్డ్ కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.