- 6,592 దృవపత్రాలు పంపిణీ
- స్పాట్ రిజిస్ట్రేషన్, పంపిణీ
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.
అల్లూరి జిల్లా,పాడేరు, ది రిపోర్టర్ : జగనన్న సురక్ష కార్యక్రమం రెండో రోజు కూడా విజయవంతమైందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండో రోజైన సోమవారం 12 మండలాల పరిధిలోని 19 సచివాలయాల్లో జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. వాలంటీర్ల యాప్‌లో వివిధ సర్టిఫికెట్ల కోసం 16,785 వినతులు రాగా, 14,164 దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడం జరిగిందని, అందులో 6,592 సర్టిఫికెట్లు పంపిణీ చేశామని, 47దరఖాస్తులు తిరష్కరణకు గురి కాగా మిగిలిన 7,525 సర్టిఫికెట్లు పంపిణీ చేయటం జరుగుతుందని కలక్టర్ వివరించారు. అదే విధంగా జగనన్న సురక్ష శిభిరాలలో మూడు ప్రత్యెక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడికక్కడే దరఖాస్తులు తీసుకొని ఆన్లైన్ చేసి దృవపత్రాలు జారీ చేసి పంపిణీకి ఆదేశించటం జరిగిందన్నారు. నెట్ సౌకర్యం ఉన్న శిభిరాలలో రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, పంపిణీ అనే మూడు కౌంటర్లు ఏర్పాటు చేయటం జరిగిందని, లబ్దిదారులు ఈ ప్రత్యెక శిభిరాలలో అక్కడికక్కడే నమోదు చేసుకొని దృవపత్రాలు పొందవచ్చని కలక్టర్ సూచించారు.