హైదరాబాద్: సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును శాసనసభలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధిహామీ పథకం పనులకు రూ.5.50 కోట్లు, ఫతేఖాన్ దర్గా అభివృద్ధికి రూ.3 కోట్లు, దీన్‌దార్‌ఖాన్ (ఫంక్షన్‌హాల్) కోసం రూ.5 కోట్లు, ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్ల శ్మశాన వాటికలకు 5 ఎకరాల చొప్పున స్థలాల కేటాయింపుతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ తదితరులున్నారు.
