- సాయిరాం కాలనీ లోఎనీ టైం’ ఏ మందైనా సరే….
- తాగినోళ్ళకు తాగినంత … ఊగినోళ్ళకు ఊగినంత
జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఎక్సైజ్ శాఖ పరిధిలో సాయిరాం కాలనీ లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది. బెల్ట్ షాషాపుల దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ పోలీసులు బెల్ట్ షాప్ యాజమాన్యం ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాయిరాం కాలనీ లో’ఎనీ టైం ఏ మందైనా సరే అందుబాటులో ఉంటుంది. రాత్రనకా, పగలనకా, సమయంతో పని లేకుండా, కావలసిన మందు అన్ని రకాల బ్రాండ్ మద్యం అమ్మకాలు బహిరంగంగా సాగుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై దాడికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బెల్ట్ షాప్ నిర్వాహకుల వ్యవహారం. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో గల్లి గల్లికి బెల్టు షాప్ లు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
అంతే కాకుండా తాగిన మత్తులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిపై గొడవలు పెట్టుకొని తిట్టడం కొట్టడం చేస్తున్నారు. పీకల దాకా తాగాలి.. ఎవరో ఒకరితో గొడవ పడాలి అనే కోణంలో అర్థరాత్రిళ్లు రోడ్లపై తిరుగుతూ గొడవలకు దారి తీస్తున్నారు. పలు కాలనీలలో బెల్ట్ దందా జోరుగా నడుస్తుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని చూసి చూడనట్లు గా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.