జగిత్యాల జిల్లా : కోరుట్ల నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం: వేములకుర్తి గ్రామానికి చెందిన బర్మా నాగేష్ అనే జనసైనికుడు, శుక్రవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో చింతలపేట గ్రామంలో జరిగిన ఒక యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సందర్భంగా, జనసేన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు , బర్మా నాగేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అదే విధంగా, బర్మా నాగేష్ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న నేపథ్యంలో, ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చెక్కు రాగానే, తక్షణం కుటుంబ సభ్యులకు అందజేయాలని రామారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు రాధారం ప్రభాకర్, ఆరే నరేందర్, మాసం విజయ్, పేట అభినవ్, శశి, ప్రశాంత్, మధుకర్, సాయి కుమార్, రమేష్, అరుణ్, శ్రీకాంత్, వినోద్, లక్ష్మణ్, ఆనంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.