జగిత్యాల జిల్లా,కోరుట్ల : ముందస్తు అనుమతి లేకుండా పట్టా మరియు ప్రభుత్వ భూముల నుండి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అడిషనల్ డైరెక్టర్ ( ఏ డీ) కే. జై సింగ్ తెలియచేసారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోరుట్ల మండలం లోని ఏకీన్పూర్ మరియు అయిలాపూర్ గ్రామాలలోని మట్టి గుట్టలను పరిశీలించారు. అక్రమంగా మట్టిని తరలించి వారిపై అపరాధ రుసుం విధింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడీ తో పాటు మండల తహసిల్దార్ కిషన్ , గిర్ధావర్ రాజేందర్ రావు,మండల సర్వేయర్ కుమారస్వామి ఉన్నారు
