రాయికల్/ ఇటిక్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారాం కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడిన వారికి వార్నింగ్ ఇస్తూ జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నట్లు బాధితుడు బోయిన గంగారాం తెలిపారు. వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారాం తాత ముత్తాతల నుండి వస్తున్నా ఓ ల్యాండ్ విషయంలో బంధువైన మారంపల్లి శ్రీనివాస్ మేడిపల్లి మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా విధులను అడ్డంగా పెట్టుకుని బోయిని గంగారం తన సర్వే నెంబర్ 779/ఆ కావాలని రికార్డులో కొట్టేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తనకు దక్కించుకోవాలని రికార్డులో కొట్టేపిస్తూ అక్రమాలకు పాల్పడుతూ అధికారులను తప్పుదో పట్టిస్తూ గతంలో కూడా ఓ ల్యాండ్ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడితే ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నిజ నిర్ధారణను పరిశీలించిన కోర్టు ఆ ల్యాండ్ భాదితుడిదేనని విచారణలో తేలడంతో కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జంకు తిన్న అధికారి మారంపల్లి శ్రీనివాస్ బాధితుడికి ల్యాండ్ ను అప్పగించి అక్కడినుండి జారుకున్నాడు. ఇలా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమాయక ప్రజల భూమిని లాక్కొని అధికారులతో పాటు అధికార యంత్రాంగానికి చెడ్డ పేరు తెప్పిస్తున్నాడు. అయితే ఇలాంటి ఘటనలో ఉన్నత అధికారులు తనకు సపోర్ట్ ఇస్తున్నారని వినికిడి. ఇలా పేద అమాయక ప్రజలను బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూడని సమాచారం. ఇందులో మారంపల్లి శ్రీనివాస్ తో పాటు ఉన్నతాధికారులకు లంచాలు అందుతున్నాయన్న సమాచారం. ఇలాంటి ఘటనలు నిజాయితీగా పనిచేస్తున్న కొంతమంది అధికారులపై ఆరోపణలు రావడం సహజమే. కాగా మారంపల్లి శ్రీనివాస్ కు అక్రమ ఆస్తులు ఎన్నో ఉన్నాయని విచారణ చేస్తే గాని తెలియదు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది క్రితం బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అప్పటి రాయికల్ ఎస్సై కిరణ్ కుమార్ బాధితుల దగ్గర నుండి ఆధారాలు స్వీకరించి భూకబ్జా దారులపై కేసు నమోదు చేయడం జరిగింది. సాధారణ ట్రాన్స్ఫర్లో భాగంగా రాయికల్ ఎస్సైగా అజయ్ బాధ్యతలు చేపట్టాడు. కాగా లంచాలకు మరిగిన ఎస్సై అజయ్ బాధితుల నుండి 30 నుండి 50,000 వేలు రూపాయలు కావాలంటూ డిమాండ్ చేయడంతో బాధితులు వారు పేదవారిమని అంతా ఇచ్చుకోలేమని మా భూమిని వారు కావాలనే కబ్జా చేశారని అప్పటి రాయికల్ ఎస్సై అజయ్ కు తెలిపారు. అదే ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ బాధితుడు రాయికల్ ఎస్సై అజయ్ అఘాయిత్యలు అక్రమాలు చూడలేక ఏసీబీ ని ఆశ్రయించడంతో అప్పటి ఎస్సై అజయ్ బండారం బయటపడింది. కాగా రాయికల్ ఎస్సై ప్రభుత్వం ఇస్తున్న అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న వారికి వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ ఏసీబీ అధికారుల వలలు చిక్కడంతో అధికారుల నుండి తప్పించుకున్న అజయ్ ఆ ఎస్సై అజయ్ తండ్రి ఓ న్యాయవాదని తెలుస్తోంది. కాగా 40 రోజులకు పైగా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకున్న అజయ్ బెయిల్ పై బయటకు వచ్చినట్టు సమాచారం. కాగా ఇలాంటి నీచ , నికృష్టమైన దరిద్రపుగొట్టు ఎస్సై అజయ్ లాంటివారు ఎంతోమంది జగిత్యాల జిల్లాలో ఉండడం గమనార్హం. బాధితుడు బోయిని గంగారాం మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ, స్థానిక జిల్లా ఎస్పీకి తమ గోడును విన్నవించుకున్నానని అప్పటికే ఇట్టి విషయం ఎస్పీ అశోక్ కుమార్కు తెలుసునని అశోక్ కుమార్ చెప్పడం గమనార్హం. ఈ భూకబ్జాలకు పాల్పడుతున్న వారికి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సపోర్ట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వంశ పారంగా వస్తున్న భూములను కబ్జా చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకొని తమ భూములను తమకు ఇప్పించాలని వెడుకుంటున్నారు. గత కొన్నినెలలుగా ఆర్థికంగా మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నమని ఎలాంటి తపులు చేయకుండానే కుల పెద్దలు తమని కుల బహిష్కరణ చేయడం . తమతో ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని చెప్పడం. దారుణమని కన్నీటి పర్యంతం అయ్యారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పోలీసు యంత్రాంగం స్పందించి తమ భూమీనీ అక్రమించాలనీ చూస్తున్న వారిపై, కుల బహిష్కరణ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాము మానసిక వేదనకు గురైతున్నామని తమకు ఏ నష్టం జరిగినా కుల పెద్దలే బాధ్యత వహించాలని అన్నారు.