జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మెండె చిన్న ముత్తన్న (32) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఈనెల 6న మృతి చెందాడు. అతనికి భార్య లక్ష్మి (28), ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు కూతురు (9), ఇద్దరు కొడుకులు (కవలలు) 4 సంవత్సరాలు. మూడు పదుల వయస్సు లోనే భర్త ఆకస్మిక మృతితో భార్య, పిల్లలు అనాధలుగా మారారు. భార్య లక్ష్మీ కూడా ప్రస్తుతం అనారోగ్యం తో బాధపడుతుంది. భార్య, పిల్లలు ఆపాన్నాహాస్తాం కోసం ఎదురుచూస్తున్నారు… విషయం తెలిసిన మెట్పల్లి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహక అధ్యక్షుడు పూల శ్రీనివాస్ ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ చేతులమీదుగా నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. జగ్గాసాగర్ గ్రామానికి చెందిన ఇల్లందుల శ్రీధర్ శ్రీలత కుమారిని జన్మదిన సందర్భంగా వర్ష కొండ గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎస్సై అనిల్ చేతుల మీదుగా ఈ నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. పిల్లలు చదువుల కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.
