పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం, దళిత బహుజన బీమ్ సేన, శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి, బీసీ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాచర్ల పట్టణ పురపాలక సంఘ కమిషనర్ ఈవి రమణబాబు పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి మహానుభావుడు యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నాని, ఆయన బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం, మహిళల కోసం చేసిన కృషి, ఈ దేశ తొలి ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్రం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం వారి హక్కుల కోసం రిజర్వేషన్ల అమలు కోసం జీవితాన్ని త్యాగం చేసిన సామాజిక విప్లవ కారుడు, సంఘసంస్కర్త ఈ దేశ తొలి దళిత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.
ఈ సందర్భంగా దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమ సమాజ స్థాపన కృషి చేయాలన్నారు.
ఈసందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు మాట్లాడుతూ ఇలాంటి జాతీయ నాయకుల వర్ధంతి జయంతి కార్యక్రమాలను అన్ని సంఘాలు కలిసి జరుపుకోవడం హర్షనీయమని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ మెంబర్ మాచవరపు నాగేశ్వరావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం మాచర్ల నియోజకవర్గం మహిళా నాయకురాలు కొరదల జ్యోతి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన మహిళ నాయకురాలు కడియం శారమ్మ పాల్గొన్నారు.