జగిత్యాల జిల్లా,మల్లాపూర్: ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య దూరాన్ని పెంచాయి. చివరికి వారి మధ్య ఘర్షణ జరిగి అన్నను తమ్ముడు కత్తితో పొడిచి చంపాడు ఈ ఘటన మల్లాపూర్ మండలం ఓబులా పూర్ గ్రామం లో . స్థానికుల వివరాల ప్రకారం ఒబులాపూర్ గ్రామానికి చెందిన పల్లపు సాయిలు, చంద్రి అన్నదమ్ములు. వీరికి ఇరు కుటుంబాల మధ్య తరచూ ఆస్తి గొడవలు జరుగుతూ ఉండేవి అన్నారు. ఈ కక్షతో గోదావరి నది ఒడ్డున సాయిని చంద్రి కత్తితో నరికి హత్య చేశాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.