- ఎస్సారెస్పీ బ్రిడ్జి వద్ద నో సేఫ్టీ
- ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు..
జగిత్యాల జిల్లా మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల్ల గ్రామం డేంజర్ జోన్ లో బ్రిడ్జి కెనాల్ రోడ్డు బ్రిడ్జి పరిస్థితి దారుణంగా మారింది. సరైన నిర్వహణ లేక బ్రిడ్జ్ పూర్తిగా దెబ్బ తినడంతో కార్ యాక్సిడెంట్ కొన్ని రోజుల కిందట వెల్లుల్ల వద్ద ఓ కార్ కెనాల్ లోకి దూసుకెళ్లి, ఇద్దరూ మృతి చెందారని విషయం తెలిసిందే. బ్రిడ్జ్ రోడ్డు వల్ల ప్రమాదాలు జరిగి, వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. రోడ్డు మధ్యలో ఎలాంటి సైన్ బోర్డ్స్, రేడియం స్టిక్కర్స్ లేకపోవడం, చాలా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు..
మెయిన్ రోడ్స్ లో ద్విచక్రవాహనదారులతో పాటు,కార్,ఆటోలు,లారీల ప్రమాదాలు జరుగుతున్నాయి. మెయిన్ రోడ్ల కెనాల్ బ్రిడ్జితో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే దారుల్లో కూడా ప్రమాదాల హెచ్చరిక బోర్డులు లేవు. మూల మలుపులు, కల్వర్టుల దగ్గర సైన్ బోర్డులు లేకపోవడంతో చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే రోడ్డు విస్తరణ తగ్గిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మందికి పైగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.ఈ బ్రిడ్జి పై నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తిరుగుతున్నా… ఎవరు పట్టించుకోవడం లేదు. కొందరు వాహనదారులు మద్యం తాగి మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన రవాణా శాఖాధికారులు ఏమీ పట్టించుకోవట్లేదు. అని స్థానికులు చెబుతున్నారు..
రక్షణ చర్యలు కరవు..
తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించి పోలీస్ శాఖల అధికారులు విజిట్ చేసి, లోపాలను గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ అలాంటి చర్యలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రమాదాల నివారణ కోసం కెనాల్ బ్రిడ్జి సేపీ మీటింగ్ను కూడా ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.కెనాల్ బ్రిడ్జ్ పై అధికారులు దృష్టి పెట్టని ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు..