భయం విడితే 10వ తరగతి లో ఉత్తీర్ణత సాధించడం సులభతరం అవుతుందని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండల కేంద్రంలో విద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్తులకు పరీక్షలు ఎలా రాస్తే ఉత్తీర్ణత సంధించవచ్చునో తెలిపేందుకు విజయీభవ అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా మాథమేటిక్స్, సైన్స్, హిందీ, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టు లలో ముఖ్యమైన ప్రశ్నలు, ముఖ్యమైన సబ్జెక్టు లపై అధ్యాపకులు పలు చూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం విద్యార్తులకు పెన్నులు మరియు పరీక్ష ప్యాడ్ లను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ విద్యార్థులకు 10వ తరగతి అనేది భవిష్యత్తు కు మలుపని దీనిని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. ఎలాంటి భయం, ఆందోళన పెట్టుకోవద్దని ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని కోరారు. ఈ రెండు నెలల సమయం ఎంతో ముఖ్యమైనదని దీనిని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను వెల్లవచ్చునన్నారు. ఈ రెండు నెలలు టీవీకి మరియు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని చూచించారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి పాఠశాలకు, గ్రామానికి మరియు జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులందరు విద్యార్తులను విర్భయంగా పరీక్షలు రాసే విదంగా మానసికంగా దృడంగా తయారు చేసే విందంగా కృషి చేయాలన్నారు. తెలియని ప్రశ్నల కోసం సమయం వృదా చేసుకోవద్దని, తెలిసిన ప్రశ్నలను ముందుగా రాయాలని చూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.