సంస్కృతి సంప్రదాలాలతో పాటు పండుగల ప్రాముఖ్యతను ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళా ఉద్యోగులు పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. ప్రభుత్వ పథకాలను తెలిపే ముగ్గులతో పాటు ఆలోచనాత్మక ముగ్గులను మహిళలు వేశారు. పోటీలలో గెలుపొందిన వారికి అధితుల చేత బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ ప్రసాద్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్ దూరదర్శన్ తో మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అలాగే మన పండుల విశిష్టత తెలుసుందని అన్నారు. మన పండుల ప్రాముఖ్యతను మరువవద్దని, సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులు పని చోట లైంగిక వేధింపులు జరిగినప్పుడు అధికారులు దృష్టికి తీసుకురావాలని చూచించారు. మహిళల హక్కులకు భంగం కలిగితేకఠిన శిక్షలు పడుతాయని అవగాహన కల్పించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తెలియజేశారు.