జగిత్యాల జిల్లా : ప్రస్తుతం జరుగుతున్న బిజెపి జగిత్యాల జిల్లా కొత్త రథసారథి ఎవరు అనేది జోరుగా చర్చలు సాగుతున్నాయి జిల్లా బిజెపిలో అధిష్టానం ఎవరికీ జిల్లా అధ్యక్ష పదవి పగ్గాలు ఇస్తుందోనని కార్యకర్తలు మరియు నాయకులు మధ్య చర్చకు తెర లేపింది హిందుత్వ విలువలను కాపాడేవారు ఎవరని చర్చకు కేంద్ర బిందువు అయింది పదుల సంఖ్యలో ఆశ వాదులు ఉండగా ఈ నలుగురు నాయకులపై చర్చలు జరుగుతున్నాయి జిల్లాలో యువ నాయకునిగా సురభి నవీన్ కుమార్ పేరు వినిపిస్తుంది, అలాగే బిజెపి నాయకురాలు భోగ శ్రావణి పేరు కూడా వినిపిస్తుంది, అలాగే సీనియర్ నాయకుడు పైడిపెల్లి సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుంది, అలాగే సీనియర్ నాయకులు ముదగంటి రవీందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది, ఈ నలుగురిలో ఎవరిని అధిష్టానం జిల్లా రతసారధిగా నియమిస్తుందో అని కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది ఇదిలా ఉంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి హిందుత్వమే ఊపిరిగా ఉంటూ రాష్ట్ర నాయకునిగా కోరుట్ల నియోజకవర్గ నాయకులుగా పార్టీకి సేవలందించి కోరుట్ల నియోజకవర్గ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రావలసిన బిజెపి పార్టీ టిక్కెట్టును అధిష్టానం నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ కు కేటాయించగా అరవింద్ కు సహకరిచారు అధిష్టానం ఆదేశం శిరసా వహిస్తూ హిందుత్వ వికాసానికి తనదైన శైలిలో నిత్యం కార్యకర్తల మధ్య ఉంటూ ఇటీవల బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గo అంత తిరుగుతూ దాదాపు 10వేల సభ్యత్వాలు చేయించి రాష్ట్రంలోనే టాప్ 5 స్థాయిలో నిలిచారు , ఆర్థికంగా బలంగా ఉన్న నేతగా కేంద్రస్థాయి రాష్ట్రస్థాయి నాయకులతో బంధాలు కలిగి కష్టపడే తత్వం గల నాయకునిగా జగిత్యాల జిల్లా లో యువతను బిజెపి వైపు ఆకర్షించడంలో సురభి నవీన్ ఎకలేని గుర్తింపు పొందారు బిజెపి జిల్లా అధ్యక్షునిగా సురభి నవీన్ కుమార్ నియమిస్తే జిల్లాలో బిజెపి పార్టీకి పూర్వ వైభవం ఉంటుందని బిజెపి కార్యకర్తలు బీజేవైఎం, నాయకులు జోరుగా చర్చించుకుంటున్నారు , బీజేపీ జగిత్యాల అసెంబ్లీ నుండి 2023 మొదటి సారి పోటీ చేసిన భోగ శ్రావణి కూడా బీసీ సామాజిక వర్గం మహిళ కోట అనే అంశాలు కలసి వచ్చి జిల్లా అధ్యక్ష పదవి తనకే వారిస్తుందని వారి అభిమానులు కోరుకుంటున్నారు, బీజేపీ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గా రెండు సార్లు చేసిన అనుభవంతో పైడిపెల్లి సత్యనారాయణ మూడో సారి కూడ జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది అని సీనియర్ నాయకులు గా ABVP నుండి వచ్చేనా నేతగా పైడిపెల్లి సత్యనారాయణ కు మంచి గుర్తింపు వుంది , బిజెపి పార్టీలో సీనియర్ నాయకునిగా ముదిగంటి రవీందర్ రెడ్డి కి మంచి గుర్తింపు ఉంది 2014- 2018 అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసి ఓడిపోయిన నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి టికెట్ రాకపోవడం తో పార్టీ నిర్ణయనికి కట్టుబడి వుంటూ క్రమశిక్షణ కలిగిన నేతగా సంఘ పరివార్ నేపథ్యం కలిగిన నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి అధ్యక్ష పదవి తమ నాయకుడిగా వరిస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నారు.
