తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్, కుటుంబసమేతంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం డిజిపి జితేందర్ ని పూర్ణకుంభంతో స్వాగతించారు.
డిజిపి జితేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోక్త మంత్రాలతో ఆయన్ని ఆశీర్వదించి, స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. కానీ జిల్లా ఎస్పీని కింద కూర్చోబెట్టడం సరికాదని కొందరు మండిపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పీ రఘు చందర్, ఆర్ఐ కిరణ్ కుమార్, మల్యాల సి.ఐ రవి, సి.ఐ సతీష్, ఎస్.ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.