పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపడు గ్రామ శివారులో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. స్థానిక రిపోర్టర్ విఆర్వో ప్రసాద్ కి సమాచారం ఇవ్వగా ప్రసాద్ మాత్రం అక్రమ మైనింగ్ మాఫియదారులకు ఫోన్ చేసి పలావాడు ఫోటోలు వీడియోలు తీసాడు అని తెలిపినట్లు సమాచారం. మట్టి మాయగాళ్లు మాత్రం రాత్రి పగలు అనే తేడాలేకుండా అక్రమ మట్టి రవాణా జోరుగా సాగిస్తున్నారు. అంతేకాక వాహనదారులు అడ్డగోలు స్పీడ్ తో వాహనాలు నడుపుతున్నారని ఆరోపణంలు వినవస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు రోడ్డు పై తిరుగుతుంటారు జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి ? ప్రభుత్వ అధికారులా ! లేక మట్టి మాయగాళ్ళా ! ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.