పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపడు గ్రామా శివారులో మట్టి మాఫియా రెచ్చిపోతుంది . ఇప్పుడే అందిన వార్తా .. ఎటువంటి అనుమతులు లేకుండ మట్టి తరలింపు జోరుగా సాగుతుంది. నిన్న రాత్రి కూడా ఇదే విధంగా మట్టి మాయగాళ్లు అక్రమంగా మట్టిని తరలించారు. పగలు, రాత్రులు తేడా లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలుజరుగుతున్నాయి. ఇళ్ల స్థలాలు, వెంచర్లకు మట్టి తరలిస్తున్నారు. పిడుగురాళ్ల, జానపడు లో ఉన్న విఆర్వో లకు తెలిసినా పట్టించుకోకుండా దగ్గరుండి వారే వారిని కాపాడుతున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. మైనింగ్ అధికారులు మాత్రం తాయిలాలకు అలవాటు పడి మట్టి మాయగాళ్లకు అండగా నిలుస్తున్నారు. ఇంతలా జోరుగా సాగుతున్న మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారి పై గాని వారి వాహనాల పై గాని ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అడిగే వారు లేరు.. అడ్డుకునే దమ్ము ఎవరికి లేదు అన్నట్లుగా వ్యవరిస్తున్నారు. వార్తలు వేసిన రిపోర్టర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ భూములు కనబడితే చాలు మట్టిని తోడేస్తున్నారు. జానపడుతో పాటు పిడుగురాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఈ తవ్వకాలు ఎక్కువగా జరుగుతుతున్నట్లు ది రిపోర్టర్ టివి కథనాలు వేసినప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులను కట్టడి చేస్తారా? చేయరా ? వేచి చూడాలి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదని అధికారులు గ్రహించాలి.