పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో గత రెండు రోజుల నుండి కరెంట్ , నీరు లేక ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులూ రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కొందరు స్థానికులు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నాయకులు వారి పార్టీకి సంబంధించిన నాయకులకి, ఓటర్లకి మాత్రమే వాటర్ సప్లై చేస్తున్నారని మిగతావారికి నీరు అందివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.