గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణానికి చెందిన జనసైనికుడు ధనుంజయ గత కొద్ది నెలల క్రితం బైక్ యాక్సిడెంట్ లో మరణించాడు. ఈ విషయమై మానవతా దృక్పథంతో ముఖ్యంగా కొణిదెల పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో జనసైనికులు, జనసేన నాయకులు సహచర జనసైనికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని తలంపుతో అందరూ కలిసి వారి కుటుంబ సభ్యులకు 50,000 ఆర్థిక సహాయన్ని గుంతకల్ నియోజకవర్గం జనసేన బాధ్యుడు వాసగిరి మణికంఠ, గుత్తి పట్టణ మండల, అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ సీనియర్ నాయకులు బోయ గడ్డ బ్రహ్మయ్య, నాగయ్య రాయల్, హేమంత్ రాయల్, CM ధనుంజయ, మిద్దె ఓబులేసు, నాగప్ప రాజు, గోపాల్ రాయల్ చేతుల మీదుగా అందించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి సైనికుడి భద్రతా, భవితవ్యానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికి ఈ ఆర్థిక సహాయమే నిదర్శనమని రాబోయే రోజుల్లో కూడా అమరుడైన ధనుంజయ కుటుంబానికి పార్టీ అన్ని రకాలుగా అండగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేశు పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య వెంకటపతి నాయుడు మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల నాగయ్య మండల జనరల్ సెక్రెటరీ మిద్దె ఓబులేష్. జింక హేమంత్ ధనంజయ చిరంజీవి ఫ్యాన్ సీనియర్ అభిమాని నాగప్ప రాజు గోపాల్ మురళి నాయక్ పోతురాజు ఆమదాల రమేష్ హసేన్ భాష బసనేపల్లి రంగా గుంతకల్ నాయకులు నందా అంజి లారెన్స్ సుబ్బయ్య నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.