తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు కసరత్తులు ముమ్మరం చేశాయి. తాజాగా, తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు…
1. కూకట్ పల్లి
2. పటాన్ చెరు
3. ఎల్బీ నగర్
4. సనత్ నగర్
5. ఉప్పల్
6. కుత్బుల్లాపూర్
7. శేరిలింగంపల్లి
8. మల్కాజిగిరి
9. మేడ్చల్
10. మునుగోడు
11. ఖమ్మం
12. వైరా
13. నాగర్ కర్నూలు
14. కొత్తగూడెం
15. అశ్వరావుపేట
16. పాలకుర్తి
17. నర్సంపేట
18. స్టేషన్ ఘన్ పూర్
19. హుస్నాబాద్
20. రామగుండం
21. జగిత్యాల
22. నకిరేకల్
23. హుజూర్ నగర్
24. మంథని
25. కోదాడ
26. సత్తుపల్లి
27. వరంగల్ వెస్ట్
28. వరంగల్ ఈస్ట్
29. ఖానాపూర్
30. పాలేరు
31. ఇల్లందు
32. మధిర